ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఒకప్పుడు ఇతను లేని తెలుగు సినిమా లేదు. బ్రహ్మానందం 600 పైగా తెలుగు సినిమాలు చేశారు. గత కొన్ని రోజుల క్రితం బ్రహ్మానందం అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యాడు. చికిత్స అనంతరం కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇప్పుడు తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమాలో బ్రహ్మి నవ్వులు పూయించేందుకు సిద్ధం అయ్యాడు.
అయితే, వాల్మీకి షూటింగ్ చివరిరోజున కమెడియన్ బ్రహ్మానందం దర్శకుడు హరీష్ శంకర్ కు షాక్ ఇచ్చాడు. లంచ్ సమయంలో బ్రహ్మి డైరక్టర్ హరీష్ కు స్వయంగా వడ్డించాడు. బ్రహ్మానందం వడ్డిస్తున్న ఫోటోను హరీష్ శంకర్ ట్విట్టర్లో షేర్ చేసి.. ఎందరికో ఈ అదృష్టం.. సినిమాకు రుణపడి ఉంటాను అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటె ఈరోజు సాయంత్రం 5 గంటలకు వాల్మీకి సినిమాలోని గగన వీధిలో అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
ఎంత మందికో ఈ అదృష్టం……..
Indebted to CINEMA………. Last day shoot of #Valmiki with full of surprises!!!!!! pic.twitter.com/q74ktbHh1h— Harish Shankar .S (@harish2you) September 4, 2019