Comedian Ali Networth:
టాలీవుడ్‌లో అగ్ర కమెడియన్‌గా పేరు పొందిన అలీ కి ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంది. అందుకే అలీ టాలీవుడ్‌లో లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు.
అలీ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి అనే చిన్న పట్టణంలో జన్మించారు. 1981లో సీతకోక చిలుక అనే సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, ఆయనకి పెద్ద బ్రేక్ మాత్రం 1994లో వచ్చిన యమలీల సినిమాతో వచ్చింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో నటించేందుకు అలీకి అప్పట్లో రూ. 50,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అలీ రోజుకు రూ. 3 లక్షలు తీసుకుంటున్నారు.
అలీ కేవలం మంచి నటుడే కాదు, తెలివైన వ్యక్తి కూడా. 70ల నటుడు శోభన్ బాబును స్ఫూర్తిగా తీసుకుని, తన కెరీర్ ప్రారంభంలోనే భూములపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన నెట్‌వర్త్ సుమారు రూ. 750 కోట్లు.
అలీ తన కుటుంబంతో హైదరాబాద్లోని మణికొండలో గ్రాండ్ బంగ్లాలో నివసిస్తున్నారు. ఆయన భార్య జుబేదా అలీ కూడా YouTube లో కుకింగ్, ట్రావెల్, ఫ్యామిలీ వీడియోలు షేర్ చేస్తూ 1.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో పాపులర్ అయ్యారు.
అలీ 1994లో జుబేదాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
అలీ ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 1,000కుపైగా సినిమాల్లో నటించారు.
ALSO READ: Game Changer సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ ఖర్చయ్యిందో తెలుసా?