HomeTelugu Big Storiesచిరంజీవిని కలిసి కుమార్తె వివాహానికి ఆహ్వానించిన అలీ దంపతులు..

చిరంజీవిని కలిసి కుమార్తె వివాహానికి ఆహ్వానించిన అలీ దంపతులు..

comedian ali Zubeda couple
ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తె ఫాతిమా వివాహం ఈ నెల 27న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుభలేఖలు పంచే పనుల్లో బిజీగా ఉన్నారు అలీ-జుబేదా. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన అలీ దంపతులు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ని కలిశారు.

చిరు నివాసానికి వెళ్లిన అలీ దంపతులు ఆయనకు తమ కూతురు పెళ్లి పత్రికను అందజేశారు. కుటుంబ సమేతంగా వివాహానికి హజరై నూతన వధూవరులకు ఆశీస్సులు అందించాలని చిరంజీవిని కోరారు. అలీ-జుబేదా దంపతులకు ఆత్మీయ ఆహ్వానాన్ని అందించిన చిరంజీవి ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఫాతిమా ఇటీవలే డాక్టర్‌ కోర్సును పూర్తి చేసుకుంది. అలీకి కాబోయే అల్లుడు కూడా డాక్టరేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన ఫాతిమా నిశ్చితార్థ వేడుకకు సాయికుమార్‌, బ్రహ్మానందంతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

https://www.instagram.com/p/CkxTWk2LmRi/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu