హాస్య నటుడు అలీ హీరోగా “పండుగాడి ఫోటోస్టూడియో” వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది అనే ఉపశీర్షికతో చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రిషిత హీరోయిన్‌గా పరిచయమవుతుంది. దిలీప్ రాజా దర్శకత్వంలో పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్‌గారు ఓకే చేసిన కథ ఇది. జంధ్యాల మార్క్ కామెడీ ఉంటుంది అన్నారు.
ఈ చిత్రంలో హీరోకి 40 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి కాదని నాగదేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలోనే కంచు కనకరత్నంతో ప్రేమలో పడతాడు హీరో. వీరి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా? నాగదేవత శాపం వల్ల ఆగిందా? అన్నది ఆసక్తికరం. పూర్తి హాస్యభరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన అలీ ఈ చిత్రంలో హీరోగా మంచి నటనను ప్రదర్శించారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం అన్నారు.