Allu Arjun Latest Controversy:
ప్రముఖ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా బన్నీ మీద మెగా అభిమానులు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి కాకుండా ఎన్నికల్లో వైసిపి నేత కి సపోర్ట్ చేయడంతో అందరూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకళ్ళు అల్లు అర్జున్ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. అవకాశం వచ్చినా కూడా జీవితంలో ఎప్పుడూ అల్లు అర్జున్ తో సినిమా చేయను అని చెబుతున్నారు ఒక కమెడియన్. అతను మరెవరో కాదు సాయిబాబా. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యక్షరి సీన్ తెలియని వారు ఉండరు.
ఆ సీన్ తో పాపులర్ అయిన కమెడియన్లలో ఒకళ్ళు సాయిబాబా. ఆ తర్వాత కూడా పలు చిన్నచిన్న పాత్రల్లో కనిపించారు. తాజాగా ఓకే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ మీద తన ఆగ్రహం వ్యక్తం చేశారు. బన్నీ ప్రవర్తన, ఇదిగో ఏమాత్రం బాగోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండడంలో తప్పులేదు. కానీ ఎంత పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న అల్లు అర్జున్ మీద ఇలాంటి కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు అని బన్నీ ఫాన్స్ అంటున్నారు. పైగా సాయిబాబా కి ఇండస్ట్రీలో అంత పెద్ద పేరు కూడా లేదు.
మరోవైపు అల్లు అర్జున్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలలో ఒకరు. అలాంటిది బన్నీ మీద కామెంట్స్ చేస్తే.. తర్వాత ఆఫర్లు వస్తాయో లేదో కూడా డౌటే. అయినా కూడా తెగించి ఇలాంటి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముంది అని కొందరు అంటున్నారు. మరికొందరు మెగా అభిమానులు మాత్రం సాయిబాబా అన్నదాంట్లో తప్పేమీ లేదని.. బన్నీ ప్రవర్తన మీద సొంత కుటుంబ సభ్యులైన నాగబాబు, సాయిధరమ్ తేజ్ కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారని అంటున్నారు.