HomeTelugu Trendingరామ్‌ గోపాల్‌ వర్మపై కలర్స్‌ స్వాతి కామెంట్స్‌

రామ్‌ గోపాల్‌ వర్మపై కలర్స్‌ స్వాతి కామెంట్స్‌

3 6
కలర్స్‌ స్వాతి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈమెకు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ వుంది. మొదటి నుంచి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చిన స్వాతి, పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉంది. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ‘కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోను ఆమె నటించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె వర్మ గురించి ప్రస్తావించింది.

“వర్మ దర్శకత్వంలో నేను ఈ సినిమా చేసిన తరువాత, ఆయన గురించి అంతా నన్ను అడగడం మొదలుపెట్టారు. ఆయన అలా అట గదా .. ఇలా అటగదా అంటూ మొహమాటం లేకుండా అడిగేవారు. కానీ వర్మ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అవసరానికి మించి నాతో ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ‘స్వాతి నువ్వు చాలా టాలెంటెడ్ .. నిన్ను చూస్తుంటే నాకు రేవతి గుర్తొస్తుంది. కాకపోతే మీ ఇద్దరూ కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు .. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో’ అనేవారని చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu