టాలీవుడ్ నటి ‘కలర్స్’ స్వాతి కొంతకాలం క్రితం పైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకుంది. అయితే తాజా స్వాతి అతన్నుండి విడిపోనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తతలపై స్వాతి స్పందించింది. గతంలో ఇలియానా, సనా ఖాన్ తదితర హీరోయిన్స్ తమ బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడిపోయిన తరువాత, వారితో కలిసున్నప్పుడు దిగిన ఫోటోలను తమతమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. తాజాగా స్వాతి సైతం వికాస్ తో కలిసున్న చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసేసింది.
దానితో.. ఆమె కూడా తన భర్తకు దూరమైందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు షికార్లు చేశాయి. వీటిపై వివరణ ఇచ్చిన స్వాతి, అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. భర్తతో తాను దిగిన చిత్రాలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ, తన స్మార్ట్ ఫోన్ లోని వాటిని చూపిస్తూ, ఓ చిన్న వీడియోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు హారీపోటర్ డైలాగ్ ను కామెంట్ గా పెట్టింది.
https://www.instagram.com/tv/B_HYrJmAQi1/?utm_source=ig_web_copy_link