కలర్స్ స్వాతి.. నవీన్ చంద్ర – ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించిన ‘అమ్ము’ సినిమా చూసిన స్వాతి, తనదైన శైలిలో స్పందించింది. ‘అమ్ము’ సినిమా చూశాను .. కథ .. డైలాగ్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కనెక్ట్ అయ్యాను. గతంలో నేను .. నవీన్ చంద్ర కలిసి నటించాము. ‘త్రిపుర’ సినిమాలోకి భిన్నంగా ఈ సినిమాలో ఆయన రోల్ ఉంది. నవీన్ మన ఇండస్ట్రీకి దొరికిన జెమ్ లాంటి వాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన శాడిస్ట్ పాత్రను చూసి షాక్ అయ్యాను. దాంతో ఆయనను చూడాలంటేనే నాకు భయం వేసింది. ఇంటర్వెల్ లో ఆయన వచ్చి నాతో మాట్లాడబోతే .. ఆ సినిమా మూడ్ లోనే ఉన్న నేను, ‘నాతో మాట్లాడకు .. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని చెప్పేశాను” అంటూ నవ్వేసింది.
నవీన్ చంద్రతో ప్రస్తుతం నేను ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాను చేస్తున్నాను. ఆ సినిమా షూటింగులో ఈ ప్రాజెక్టును గురించి చెబుతూ ఉండేవాడు. నవీన్ ఈ మధ్య కాలంలో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వెళుతున్నాడు. తనకి ఎలాంటి పాత్రను ఇచ్చినా చాలా సిన్సియర్ గా చేస్తాడు. అలాగే ఈ సినిమాలో ఆయన అద్భుతంగా చేశాడు .. తను దిష్టి తీయించుకోవాలి” అంటూ స్వాతి చెప్పుకొచ్చింది.