Tollywood Upcoming Movies:
ఒక నెలలో ఒక సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యాక.. ఇంకొక ఏడాది మళ్ళీ అదే నెలలో అదే హీరో.. మరొక సినిమాని రిలీజ్ చేసి హిట్ అందుకోవచ్చు. ఇలా చాలాసార్లు జరిగింది కూడా. అందులో వింత ఏమీ లేదు. కానీ నలుగురు హీరోలు ఒకే నెలలో రెండవసారి తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం అవ్వడం ఇదే మొదటిసారి కావచ్చు.
2016 సెప్టెంబర్ లో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అనే సినిమాలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్లో రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఏడాది అంటే 2017తో సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకని సంక్రాంతి విజేతలుగా నిలిచాయి.
అయితే ఈ నలుగురు హీరోలు.. ఇప్పుడు మళ్లీ అవే నెలలలో తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి కూడా కొరటాల శివ దర్శకత్వం వహించడం యాదృచ్ఛకం.
ఇదే ఏడాది డిసెంబర్ లో.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదలవుతుంది.. అని దిల్ రాజు ఇప్పటికే చెప్పారు. మరోవైపు వచ్చే ఎడాది 2025 సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన.. విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. నందమూరి బాలకృష్ణ ఎన్.బి.కె109 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మెగా నందమూరి హీరోలు ఓకే నెలలో తమ సినిమాలను విడుదల చేయడం ఇంకా పెద్ద యాదృశ్చికం. అయితే అప్పుడు విడుదలైన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. మరి ఎప్పుడు కూడా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి హిస్టరీ రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి.