ఏసీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై విపక్షాల నుంచి, సాహితీవేత్తల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు … మౌలానా ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు కుమారుడు ఏ మీడియంలో చదివాడు? ఆయన మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడని ప్రశ్నించిన జగన్.. మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శలపై స్పందిస్తూ.. మీ మనవళ్లు ఏ మీడియం స్కూళ్లో చదువుతున్నారంటూ ప్రశ్నించారు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు మరింత ఘాటుగా సమాధానమిచ్చారు సీఎం వైఎస్ జగన్… యాక్టర్ పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు.. బహుశా నలుగురో.. ఐదుగురో పిల్లలు అనుకుంటా.. వారంతా ఏ మీడియం స్కూల్‌లో చదువుతున్నారంటూ కౌంటర్ ఎటార్ చేశారు జగన్.
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లల్లో చదివితేనే పోటీ ప్రపంచంలో గెలవగలరని స్పష్టం చేశారు జగన్.. అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెడుతున్నామన్న ఆయన.. తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామన్నారు. ఇంగ్లీష్ మీడియంలో పేదవాళ్ల పిల్లలు చదవకూడదా అంటూ ప్రశ్నించారు. పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం వద్దంటూ పెద్దపెద్దవాళ్లు.. చంద్రబాబు, వెంకయ్యనాయుడు లాంటి పెద్దపెద్ద నేతలు.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్దపెద్ద యాక్టర్లు స్పందించిన తీరు సరైందికాదని జగన్ అన్నారు.