ఏపీ సీఎం జగన్ కాన్వాయ్.. రోగిని తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు దారిచ్చింది. జగన్ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి బయల్దేరారు జగన్. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం మధ్యాహ్నం కాన్వాయ్ బయల్దేరింది. విజయవాడ బెంజ్‌సర్కిల్ నుంచి వెళ్తున్న సమయంలో ఓ ప్రైవేటు అంబులెన్స్ అటు వైపుగా వచ్చింది. దీంతో ఆ అంబులెన్స్‌కు కాన్వాయ్ దారిచ్చింది.
గతంలోనూ అంబులెన్స్ కోసం జగన్ తన కాన్వాయ్‌ను ఆపడం గమనార్హం. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన జగన్.. తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో ఓ అంబులెన్సు వస్తోందని తెలుసుకుని అది వెళ్లే వరకు నిరీక్షించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.