ఎంత మంది వ్యతిరేకించినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుచేసి తీరుతామని తేల్చిచెప్పారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ఒంగోలులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చరిత్రలో తొలి అడుగు వేస్తున్నట్లు చెప్పారాయన. ఇంగ్లీష్ చదువులు రాకపోతే పిల్లల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు సీఎం. ప్రతీ స్కూల్ ఇంగ్లీష్ మీడియంగా మారినా.. తెలుగు తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా ఉంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్. పేద పిల్లలు ఇంగ్లీష్ రాక .. ప్రపంచంతో పోటీపడలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. ఈ విషయంలో తాను చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు అన్నట్లుగా కొందరు పెద్దలు మాట్లాడుతున్నారని విమర్శించారు సీఎం జగన్.
ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోకి మారినా.. తెలుగు తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా ఉంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్ జగన్. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రారంభమవుతుందని.. ఆపై దశల వారీగా ఇతర తరగతులకు దీనిని అమలు చేస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. తనను ఎంత మంది టార్గెట్ చేసినా దేవుడు, ప్రజల మీద నమ్మకం ఉంచి ముందడుగు వేస్తానన్నారు జగన్. స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా గతేడాది బడ్జెట్‌లో చాలా తక్కువ నిధులు కేటాయించారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్.