తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో నిన్న వ్యక్తిగత వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు మరికొన్ని వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ ఇవాళ యశోద ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షల పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌కు వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రేపు వెల్లడించనున్నారు.