కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన టాలీవుడ్‌కు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో తెలుగు చిత్రపరిశ్రమకు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా..
1. రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ అందించడం.
2. థియేటర్ల యాజమాన్యం రోజూవారి ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడం.
3. సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం.
4. థియేటర్లకు కనీస విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని టీఆర్‌ఎస్ ప్రకటించింది.
వీటితో పాటు థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీపెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం అన్నారు.