Homeతెలుగు Newsఉద్దానం సమస్య పరిష్కారానికి సీఎం శ్రీకారం

ఉద్దానం సమస్య పరిష్కారానికి సీఎం శ్రీకారం

ఉద్దానం – ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులకు కేంద్రం. అక్కడి నీటిలో ఉన్న విషపూరిత రసాయనాల వల్ల ప్రజల పెద్ద సంఖ్యలో కిడ్నీ సమస్య బారినపడుతున్నారు. తాగునీరే కాలకూట విషమై అక్కడి ప్రజల ప్రాణాలను కిడ్నీల జబ్బు రూపంలో కబలిస్తోంది. ఇంతటి సమస్యను తక్షణం పరిష్కరించాల్సింది పోయి, తమ రాజకీయ అవసరాల కోసమే వాడుకున్నాయి కొన్ని పార్టీలు. చంద్రబాబు, పవన్, జగన్ అందరికీ ఈ సమస్య తెలుసు. కానీ నేను విన్నాను, నేను ఉన్నాను అని పాదయాత్రలో మాట ఇచ్చిన జగన్, ఉద్దానం సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. తక్షణం అక్కడి ప్రజల విషపూరిత తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అమలులో పెట్టారు. చెప్పుడు మాటలకు, కంటి తడుపు చర్యలకు ధీటుగా తన సంకల్పాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లో పెట్టింది. ముఖ్యమంత్రిగా జగన్ కూడా ఇచ్చిన హామీ మేరకు హంగు, ఆర్భాటం, ప్రచారం లేకుండా ఉద్దానం సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వారి కంటే తాను ఏవిధంగా భిన్నమైన లీడర్ నో మరో సారి తన చేతలతోనే సమాచారం చెప్పారు. యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి, కిడ్నీ వ్యాధికి శాశ్వతంగా పరిష్కారం చూపుతోంది.

YS Jagan MEIL pair up to address Uddanam problem 1

అరుదైన కిడ్నీ సమస్యకు- మేఘా మెరుగైన పరిష్కారం

ప్రపంచంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్దానం కూడా ఉంది. నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, ఉద్దానం ప్రాంతాలు ఎక్కువ కిడ్నీ వ్యాధి గ్రస్తులతో ప్రపంచంలోనే తోలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మంచినీటిలో ఉన్న విషపూరిత కారకాలు ఇక్కడ ప్రజల కిడ్నీ సమస్యకు కారణమని పలు పరిశోధనలో ప్రాధమికంగా తేల్చారు. ఈ సమస్యకు పరిష్కారం ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీటిని అందించటమేనని దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లోనే చెప్పారు. అనుకున్నదే తడవుగా ప్రజలకు సురక్షితమైన తాగు నీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన మరణంతో ఆ పథకం అటకెక్కింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం సమస్య పరిష్కారానికి ప్రయత్నించలేదు. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేసి వదిలేశారే తప్ప పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.

YS Jagan MEIL pair up to address Uddanam problem

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్దానంలో శాశ్వత తాగునీటి పధకాన్ని ఏర్పాటు చేయటం తో పాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ 700 కోట్ల అంచనాలతో ఈ పధకాన్నిడిజైన్ చేసి రూ 530 కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ లో రూ 527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ఎంఈఐఎల్ సన్నాహాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపించనుంది. తాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ లు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఈ పథకాన్ని నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందనే నమ్మకంతో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. తాజా ప్రాజెక్టుతో వీరందరూ సమస్య నుంచి గట్టెక్కనున్నారు.

లక్ష్యం మంచిదైతే- భగీరథుడు దిగివస్తాడు
ఉద్దానం బాధితులకోసం 100 కిలో మీటర్ల పైప్ లైన్

ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74 లక్షల మంది నివశిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు తాగునీటి అవసరాలకు ఎక్కువగా బోరు నీటిపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత భూ గర్భ జలాలలో కిడ్నీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్న కారకాలు ఉన్నట్టు నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు.

ఏళ్ళుగా పీడిస్తున్న సమస్యకు- సంకల్పబలంతో పరిష్కారం

ఉద్దానం లో కిడ్నీ సమస్య మొదట 1985-86ల్లో బయటపడింది. 1990 దశకంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. స్థానికంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి పాలకులు ఈ సమస్యను తేలికగా తీసుకున్నారు. రోజు రోజుకు కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో నాటి పాలకులు తాత్కాలిక ఉపశమ చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. గతంలో స్థానికి నేతలు సమస్య తీవ్రతను అప్పటి సీఎం వై.ఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అది ఒక కొలిక్కి వచ్చే సమయానికి మరణించారు. 2014 లో తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రాబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. తెలుగుదేశం మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2017లో ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించి ఎంతో హడావుడి చేశారే తప్ప సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయలేదు. ఆయన 2018 మే లో ఎచ్చెర్ల లో దీక్ష చేసి మరింత హడావుడి చేశారు. ఆ తరువాత నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు వివిధ సమావేశాలతో ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారే తప్ప చేసింది శూన్యం. హార్వర్డ్ విశ్వ విద్యాలయ బృందం, 2017 జనవరి లో అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , ప్రస్తుత బిజెపీ అధ్యక్షుడు జెపీ నడ్డా విశాఖ పట్నం లో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ సమస్య పై అధ్యయనానికి నిపుణుల బృందాన్ని పంపుతానని చెప్పారు. ఇప్పటి వరకు అనేక జాతీయ, రాష్ట్రీయ సంస్థలు ఉద్దానం సమస్య పై అధ్యనం చేసాయి. అయితే సమస్యకు మూల కారణం మాత్రం కనుక్కోలేక పోయాయి. ఉద్దానంలో ప్రతి వంద మంది లో 35 నుంచి 40 మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారంటే సమస్య తీవ్రత అర్థంచేసుకోవచ్చు. ఇప్పటిదాకా పదివేల మంది ఈ మహమ్మారికి బలయ్యారని ఒక అంచనా.
ఈ తీవ్రతను పసిగట్టిన జగన్ ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగింది. మెరుగైన తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసే మేఘా నైపుణ్యంతో త్వరలోనే ఉద్దానం ఉపశమనం పొందబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu