HomeTelugu Newsమద్యపానం నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్‌

మద్యపానం నిషేధం పై కీలక నిర్ణయం తీసుకున్న జగన్‌

5రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని సీఎం నిలదీశారు.

ఈ సమీక్షలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేశ్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవీంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చే ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్నారు. ఈ నెల 8న ఉదయం 11.39 గంటలకు సచివాలయం వద్ద మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu