Homeతెలుగు Newsఎమ్మెల్సీల పనితీరుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఎమ్మెల్సీల పనితీరుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి

టీడీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా అనంతపురం జిల్లా నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శిక్షణా కార్యక్రమాలకు హాజరు కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. 12మందిని గెలిపించినా ఏ ఒక్కరికీ బాధ్యత లేదా? అంటూ మండిపడ్డారు. బూత్‌ కమిటీ శిక్షణకు కూడా ఎవరినీ పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా మెజార్టీ నేతలు స్పందించడంలేదన్నారు. పనితీరు మెరుగుపరుచుకోకుంటే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మార్పు రాకపోతే పక్కన పెట్టేస్తానంటూ ఎమ్మెల్యేలకు పరోక్షంగా సంకేతాలు పంపారు. ఎమ్మెల్సీల పనితీరుపైనా సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. వివాదాలకు కేంద్ర బిందువవుతున్న ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తీరును కూడా పరోక్షంగా సీఎం ప్రస్తావించారు. అతికొద్ది మంది తక్షణమే.. ఇంకొందరు అతిగా స్పందిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పనితీరు మెరుగుపడిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కితాబిచ్చారు.

9 16

తెలంగాణ రాజకీయాలపైనా చర్చ

టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలూ ప్రస్తావనకు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యతిరేకత లేదని మొన్నటి వరకు ప్రచారం జరిగిందన్న సీఎం చంద్రబాబు.. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నేతలకు వ్యతిరేకత వ్యక్తమవగీదన్నారు. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని తెలిపారు. దీనిపై పలువురు నేతలు స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల్లో అక్కడి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై లేదని చెప్పినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu