బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ”క్లాస్ ఆఫ్ ‘83” అనే సినిమాతో డిజిటల్ రంగం లోకి అడుగుపెడుతున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో సయ్యద్ యూనస్ హుస్సేన్ జైదీ రచించిన ‘ది క్లాస్ ఆఫ్ 83’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విజయ్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ – గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ‘క్లాస్ ఆఫ్ ‘83’కి అతుల్ సభర్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫిక్స్ లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ”క్లాస్ ఆఫ్ ‘83” ట్రైలర్ రిలీజ్ చేశారు.
”దారి తప్పిన వ్యవస్థని ఆర్డర్ లో పెట్టడానికి కొన్నిసార్లు చట్టాన్ని కూడా అతిక్రమించాల్సి వస్తుంది” అని ట్రైలర్ లో చెప్పించడం ద్వారా పోలీసు వ్యవస్థలోని అవినీతి మరియు అండర్ వరల్డ్ కి వ్యతిరేకంగా పోరాడి విఫలమైన ఓ పోలీస్ ఆఫీసర్.. తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నారు అనేదే ఈ సినిమాలోని అంశం అని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రంలో అనూప్ సోనీ జాయ్ సేన్ గుప్తా, విశ్వజీత్ ప్రధాన్, భూపేంద్ర, హితేష్ భోజ్ రాజ్, సమీర్ పరాంజపే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విజు షా సంగీతం అందిస్తున్నారు.