గత రెండు రోజులుగా నాగార్జున ‘బాహుబలి 2’ సినిమాకు సంబంధించి కృష్ణజిల్లా హక్కులను
8 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నాగార్జున క్లారిటీ
ఇచ్చాడు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. కొన్ని పుకార్లు అసలు ఎలా పుడతాయో
తెలియదనీ అన్నారు. ఈ వార్త కూడా అలాంటి పుకారేనని చెప్పారు. దయచేసి ఇలాంటి
రూమర్స్ ను నమ్మొద్దన్ని చెప్పారు. అలానే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ నుండి
కొన్ని బ్రేక్ తీసుకొనున్నట్లు చెప్పారు. ఆ స్థానంలోకి చిరంజీవి వస్తుండడం నిజమేనని
అన్నారు. చిరంజీవి రావడం వలన ‘MEK’ కు మరింత క్రేజ్ పెరుగుతుందని పేర్కొన్నారు.