ప్రముఖ సినీ కెమెరామెన్ బి.కన్నన్ 69 కన్నుమూశారు. గుండె సంబంధ సమస్యలతో చెన్నైలో ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళం, మలయాళంలో 50కి పైగా సినిమాలకు ఆయన పని చేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కన్నన్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి 40 సినిమాలకు పని చేశారు. కన్నన్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆయన పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు అంత్యక్రియలను నిర్వహిస్తారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయన తెలుగులో ..పగడాల పడవ, సీతకోక చిలుక, ఆరాధన సినిమాలకు పనిచేశారు.