HomeTelugu Big Storiesసినిమా కోసం బాలయ్య తగ్గాడు!

సినిమా కోసం బాలయ్య తగ్గాడు!

భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోలకు ఇచ్చే పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. వాళ్ళ ఇమేజ్ ను, క్రేజ్ ను
దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారు. వారు కూడా తమ డిమాండ్ బట్టి
రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ బాలయ్య మాత్రం తన సినిమా కోసం పారితోషికంలో రెండు
కోట్ల రూపాయలను తగ్గించుకున్నారనేది తాజా సమాచారం. బాలకృష్ణ హీరోగా ఆయన వందవ
సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకుడు. చారిత్రక నేపధ్యంలో
సాగే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు. ఈ క్రమంలో బాలయ్య ఈ సినిమా కోసం
ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ఆసక్తిగా మారింది. నిజానికి ఈ సినిమా కోసం
బాలయ్యకు 10 కోట్ల రూపాయలను ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. అయితే
ఈ సినిమాకు ఖర్చు భారీ స్థాయిలో అవుతుందని తెలుసుకున్న ఈ నందమూరి హీరో తన
రెమ్యూనరేషన్ నుండి రెండు కోట్లు తగ్గించుకున్నాడట. ఒక హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించడం
అనేది బాలయ్యకే చెల్లిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు మొత్తం కలిపి 70కోట్లకు
పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu