HomeTelugu Big StoriesSSMB29: మహేష్ బాబు సినిమాలో తమిళ స్టార్ హీరో..!

SSMB29: మహేష్ బాబు సినిమాలో తమిళ స్టార్ హీరో..!

Chiyaan Vikram to be a part of SSMB29
Chiyaan Vikram to be a part of SSMB29

SSMB29 Update:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎన్నోసార్లు తెలుగు ఇండస్ట్రీకి గర్వ కారణం అయిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో.. ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం నుంచి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కి సిద్ధం అవుతున్న ఈ సినిమాలో.. ఒక తమిళ్ స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు చియాన్ విక్రమ్. తమిళ్లో స్టార్ స్టేటస్ ఉన్న విక్రమ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విక్రమ్ రాజమౌళి సినిమా గురించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఒక సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన విక్రమ్ కు రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో తన పాత్ర గురించి ప్రశ్న ఎదురైంది.

దానికి మొదట విక్రమ్ రాజమౌళి చాలా మంచి డైరెక్టర్ అని అన్నారు. మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి మిమ్మల్ని సంప్రదించారా అని ప్రశ్నించగా.. దానికి విక్రమ్ చర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. “కచ్చితంగా రాజమౌళి గారితో ఒక సినిమా చేస్తాను.. అది ఇదే సినిమా అని చెప్పలేము” అని అన్నారు విక్రమ్.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో మాత్రమే బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టుల గురించి ఇంకా క్లారిటీ కూడా లేదు. కాబట్టి విక్రమ్ మహేష్ బాబు సినిమాలోనే కీలక పాత్ర పోషిస్తారని వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ నిజంగానే విక్రమ్ ఈ సినిమాలో నటిస్తే.. అది విలన్ పాత్ర అవుతుందా.. లేక మరేదైనా కీలక పాత్ర అవుతుందా వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu