చిరంజీవి తన చిరకాల మిత్రుడు సాయిచంద్ గురించి చెబుతూ.. మంచుపల్లకి సినిమాలో ఐదుగురు హీరోల్లో తనూ ఒకరు. ఫిదా సినిమాలో నటన తర్వాత సైరాలోని సుబ్బయ్య క్యారెక్టర్‌కు సాయిచంద్ అయితే బాగుంటుందని దర్శకుడు సురేందర్‌రెడ్డి అన్నారు. మాకు కూడా అదే భావం కలిగింది. ఆ రకంగా సాయిచంద్ ఈ సినిమాలో చేశాడు. సినిమా జరుగుతున్నప్పుడు సాయిచంద్ ఆ గెటప్ కోసం పూర్తిగా వృద్ధుడిలా మారిపోవడం కోసం తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ, అతను అంత వృద్ధుడు కాదు అన్నారు.
ఆ క్యారెక్టర్‌కు అంత నిడివి లేకపోయినా ఎంతో డెడికేషన్‌తో చేశాడు. ప్రతి నటుడికీ ఉండాల్సిన లక్షణం అది. ఈ సినిమా కోసం రెండేళ్లు వేరే ఏ సినిమా కూడా చేయలేదు. ఈ సినిమా లేట్ అయ్యేలా ఉంది.. ఈలోపు మా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రాబోతున్న ఉప్పెన సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడిగితే చేయనని చెప్పేశాడు. చరిత్రాత్మకమైన ఈ సినిమానే నాకు ముఖ్యం అని చెప్పేశాడు. దాంతో నాకు సాయిచంద్ మీద ఎంతో గౌరవం పెరిగింది అని చిరంజీవి అన్నారు.