ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోని దర్శకులు బయోపిక్స్ వైపు తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా కథ రాయనవసరం లేదు. జరిగిన ఘటనను సినిమాటిక్‌గా మార్చి తెరకెక్కిస్తే చాలు. అందుకే ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా బయోపిక్‌లను సినిమాలుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్,
వైఎస్‌ఆర్ వంటి లెజెండ్స్ బయోపిక్స్ తెరకెక్కినాయి. సావిత్రి బయోపిక్ మహానటి సంచలన విజయం సాధించడంతో దర్శకులకు బయోపిక్‌పై ఆలోచించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి బయోపిక్ కూడా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సైరా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు
చేశారు.
నా పాత్రకు రామ్ చరణ్ న్యాయం చేస్తాడనే నమ్మకం నాకుంది.. కానీ కొన్ని సమస్యలున్నాయి. బయోపిక్‌లో రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుంది అన్నారు. ఈ ముగ్గురిలో నా పోలికలు ఎక్కువగా ఉన్నాయని నా సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందుకే వీళ్లలో ఎవరు నటించినా బాగుంటుంది.. ఎవరు చేసినా మా కుటుంబానికి చెందిన వారు చేస్తేనే బాగుంటుంది అన్నారు. మొత్తానికి చిరంజీవికి తన బయోపిక్ తెరకెక్కిస్తే బాగుంటుందని తన
మనసులో మాట చెప్పడం విశేషం.