మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు(ఆగస్టు 22) జరుపుకుంటున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటినుంచే మొదలు పెట్టారు. కాగా ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ డైరెక్షన్‌లో 152 చిత్రం ‘ఆచార్య’ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి మెగాస్టార్ పుట్టినరోజునాడు ఆయన అభిమానులకు గిఫ్ట్ రాబోతుంది. అదేంటంటే.. తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. అందులో ఆగస్టు 22 సాయంత్రం 4 గంటలకు ఈ సినిమా నిండి చిరు ఫస్ట్‌లుక్ అలాగే మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. అయితే మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవికి ఓ ప్రత్యేక పాటను కానుకగా ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ గ్లిమ్స్ విడుదల చేసిన వారు పూర్తి సాంగ్ ని చిరంజీవి బర్త్ డే ముందురోజు అంటే ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.