
Chiranjeevi remuneration:
టాలీవుడ్‌లో హీరోల రెమ్యునరేషన్‌లు పోస్ట్ కోవిడ్ కాలంలో గణనీయంగా పెరిగాయి. కొంత మంది హీరోలు తమ మార్కెట్‌ను పెంచుకుంటూ పోతుంటే, మరికొందరు నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి మాత్రం రెమ్యునరేషన్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మిస్తుండగా, చిరంజీవి రూ. 75 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. నిర్మాతలు OTT రైట్స్ ద్వారా రూ. 50 కోట్లు ఆశిస్తున్నారు. కానీ, OTT సంస్థలు రూ. 25 కోట్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. నాన్-థియేట్రికల్ డీల్స్ పూర్తి కాకపోతే సినిమా విడుదల అవ్వడం కష్టమే.
విశ్వంభర రిలీజ్ గురించిన అనిశ్చితి మధ్య చిరంజీవి మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. చిరంజీవి రూ. 75 కోట్లు తీసుకుంటుండగా, ఆయన కూతురు సుష్మిత కొణిదెలకు రూ. 10 కోట్లు ఇచ్చేలా ప్లాన్ చేశారు. అంటే, మెగా ఫ్యామిలీ మొత్తం రూ. 85 కోట్లు తీసుకుంటోంది.
అనిల్ రావిపూడి రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా, మొత్తం బడ్జెట్ రూ. 215 కోట్లు దాటింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ పైనే ప్రాజెక్ట్ విజయం ఆధారపడి ఉంది. జీ స్టూడియోస్ నాన్-థియేట్రికల్ హక్కుల కోసం మంతనాలు జరుపుతుండగా, నిర్మాత సాహు గారపాటి ఈ భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడంలో చాలానే రిస్క్ తీసుకుంటున్నారు.
ఈ సినిమా సంక్రాంతి 2026 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, చిరంజీవి గత చిత్రాలు “ఆచార్య”, “భోళా శంకర్” ఫ్లాప్ కావడంతో నిర్మాతలకు ఆందోళన ఎక్కువగా ఉంది. సినిమా హిట్ అవ్వాలంటే, భారీ థియేట్రికల్ బిజినెస్ జరగాలి. చిరు మార్కెట్ తిరిగి లైన్‌లోకి వస్తేనే, నిర్మాతలకు లాభం ఉంటుంది.
ALSO READ: Raha Kapoor వేసుకున్న బట్టల ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది