టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. మొదటిసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బోయపాటి కూడ ఆ అంచనాల్ని అందుకునేలా పనిచేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ విషయంలో పలు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘స్టేట్ రౌడీ’ టైటిల్ ను పెట్టాలని బోయపాటి భావిస్తున్నారని టాక్. అయితే ఏ విషయం ఇంకా అధికారిక ప్రకంటించారు . మరి ఈ వార్తలే నిజమైతే బోయపాటి ‘స్టేట్ రౌడీ’ టైటిల్ ను ప్రకటిస్తారా లేకపోతే వేరే ఏదైనా టైటిల్ చూసుకుంటారో తెలియాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే.