మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 13 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం భాగ్యనగరంలో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆ సెట్లోనే తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. విభిన్నమైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇదే పేరు ఫిక్స్ అయ్యే అవకాశమున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. తమన్ సంగీతం అందిస్తున్నారు. మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.