Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది (2024)లో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది చిరంజీవికి మరింత బూస్ట్‌ని ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి 156వ సినిమా గా తెరకెక్కుతున్న ఈమూవీకి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమ నుండి విడుదలైన అప్డేట్స్ అన్నీ కూడా ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. చిరంజీవి లేని షూటింగ్ పార్ట్ ని పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.
ఈసెట్స్‌లోకి చిరంజీవి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అందుకు గానూ ఎప్పుడు చేయని విధంగా భారీ వర్కౌట్స్ చేస్తున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియో చివరిలో విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అని తెలిపారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 68 ఏళ్ల వయసులోనూ సినిమా కోసం చిరంజీవి డెడికేషన్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ వయసులో ఆ కసరత్తులు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
View this post on Instagram