టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత జోష్‌తో ఉంటారో బయట కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన ఆయన ప్రతి విషయంపైనా తన అభిప్రాయాలను, ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు చిరు. తాజాగా తన మనవరాలితో కలిసి ‘ఖైదీ నంబర్. 150’ పాటను చూస్తూ సందడి చేసిన వీడియోను షేర్ చేశారు.
”సాధారణంగా సాంగ్స్ షూట్ చేస్తున్న సమయంలో వాటిని ఆసాంతం వినేందుకు ఇష్టపడతా. మధ్యలో బ్రేక్‌లు వస్తే నాకు ఇష్టం ఉండదు. కానీ, ఇటీవల పాటను మధ్యలో ఆపి ఆపి వినడం భలే సరదాగా అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో మంగళవారం ఉదయం చెబుతా” అని నిన్న ట్వీట్ చేసిన చిరు ఆ విషయాన్ని పంచుకున్నారు.
”సంగీతానికి ఉండే శక్తిని చూస్తే నిజంగా అద్భుతం. ఏడాది వయసున్న ఈ చిన్నారిని చూడండి మ్యూజిక్‌ను ఎలా ఎంజాయ్ చేస్తోందో.. అంతేకాదు, పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం సరదాగా ఉంది. పాజ్ అండ్ ప్లే మ్యూజిక్ చూడటం ఇప్పుడు భలేగా ఉంది. పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ క్రెడిట్ కూడా నాకే” అంటూ తన మనవరాలితో కలిసి చిరు సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది.
Always amazed @ the power of music.Just over 1 yr & how this little kid enjoyed music & tried doing dance moves is sheer bliss.Paused & played music 2 see she was really loving it.పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే😄 #PreLockdownMoments #Throwbackvideo #navishka_k pic.twitter.com/znNOyMY0MB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2020