chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విశ్వంభర సినిమాను ప్రకటించాడు. నాలుగు దశాబ్దాలకుగాపై సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్న చిరు ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లోని పెద్ద పెద్ద స్టార్లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాల్టీ షోలు కూడా చేస్తున్నారు.
తాను కూడా ఓటీటీలో ఏదైనా చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు చిరంజీవి. అయితే అందుకు తగిన కథ కోసం చూస్తున్నట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ డిజిటల్ ఎంట్రీలు ఇచ్చేశారు. బాలకృష్ణ, నాగార్జున హోస్ట్‌గా చేస్తుంటే..వెంకటేష్ రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశాడు.
సిల్కర్ స్క్రీన్ పై కథ లేకున్నా మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్ లు, పాటలు, ఫైటింగ్, తన ఇమేజ్‌తో సినిమాలు నెట్టుకొస్తున్నాయి. కానీ ఓటీటీలో.. కంటెంటే కింగ్. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా అలాంటి కథ కోసం వేచి చూస్తున్నాడట. ఇప్పటికే పలువురు రచయితలకు తనకు తగిన కథను సిద్ధం చేయాలని అడిగాడు. అది కూడా మంచి క్రైమ్ డ్రామా కోసం చిరు వెతుకుతుండటం విశేషం. అంతేకాదు.
తన వయసుకు తగిన పాత్ర కావాలని కూడా అతడు పట్టుబడుతున్నాడట. ఓటీటీలు వచ్చిన మొదట్లో వీటిపై చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపలేదు. తనది సిల్వర్ స్క్రీన్ ఫిగర్ అని, ఓటీటీ తనకు సరిపడదని అప్పట్లో అతడు భావించాడు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తు ఓటీటీదే అని గుర్తించి చిరు మెల్లగా ఇటువైపు చూస్తున్నట్లు అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.