HomeTelugu Trending'బ్రహ్మాస్త్ర' ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

 

chiranjeevi voice over for
బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. యే జవానీ హై దీవానీ తెరకెక్కించిన అయాన్‌ ముఖర్జీ సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ మూవీని రూపొందించాడు. ఇటీవలే టీజర్‌తో పాటు నటీనటుల లుక్స్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేసింది. ఇందులో చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్‌ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. మరి ట్రైలర్‌ చూడాలంటే మాత్రం జూన్‌ 15 వరకు ఆగాల్సిందే!

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్‌, దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఇటీవల వైజాగ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu