HomeTelugu Big Storiesమా అమ్మ దగ్గర నీ 'బట్టర్ ' ఉడకదురా.. బచ్చా

మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా.. బచ్చా

5 1
కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దయ్యాయి. దాంతో సినిమా ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. సెలబ్రెటీలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఇంట్లోనే ఉంటూ భార్య ఉపాసనకు కాఫీ చేయడంతో పాటు వంటవండి పెట్టాడు. కాగా తాజాగా రామ్ చరణ్… ఇంట్లో ఉన్న నాయనమ్మ అంజనా దేవి, అమ్మ సురేఖ నుంచి మజ్జిక నుంచి వెన్నె ఎలా తీయడం అనే దాన్ని నేర్చుకున్నాడు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో పై మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో సంధించారు. ‘మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్వు ఎంత మంచిగా బట్టర్ చేసినప్పటికీ, నా స్థానం కన్నా నీ స్థానం బెటర్ కాదు. అది గ్యారెంటీ. ఇది మీ అమ్మ దగ్గర నాకు లేదనుకో అని ఫన్నీ ట్వీట్ చేశారు చిరు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu