HomeTelugu Trendingఆత్మకథ రాయనున్న చిరంజీవి!

ఆత్మకథ రాయనున్న చిరంజీవి!

6 5

టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో తన ప్రాస్థానం ప్రారంభించి.. మెగాస్టార్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మధ్యలోను ఎత్తుపల్లాలను ఎదుర్కుంటూ వచ్చారాయన. ఎన్టీఆర్ .. అక్కినేని .. కృష్ణ .. శోభన్ బాబు తెలుగు తెరను ఏలుతున్న టైమ్‌లో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికే చిరంజీవి ఎదిగిన వైనంపై పలు పుస్తకాలు ఇంతకుముందు వచ్చాయి. అయితే ఆత్మకథ రాయాలని ఉందనే విషయాన్ని గురించి ఆయన కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే ఆయనకి అంత సమయం లేకపోవడం వలన, ఆ ఆలోచన వాయిదాపడుతూ వచ్చింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, తన ఆత్మకథను గురించి ఆలోచనను ఆచరణలో పెట్టినట్టుగా సమాచారం. తన కెరియర్ మొదలవడానికి ముందు విషయాలు .. కెరియర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలు .. జ్ఞాపకాలను ఆయన రికార్డు చేస్తున్నారట. త్వరలోనే ఈ సమాచారాన్ని ఆయన మంచి రచయితకు ఇచ్చి, తన ఆత్మకథను పుస్తకరూపంలో వెలువరించనున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu