Chiranjeevi’s Vishwambhara release:
వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా పడకపోవడం మెగా అభిమానులను కలవరపరుస్తోంది. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిని ఈ సినిమాలో ఒక కొత్త అవతారంలో చూడటానికి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సింది. కానీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు అని సినిమా విడుదల వాయిదా వేశారు. అయితే గతేడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ గేమ్ చేంజెస్ సినిమా కూడా ఈ ఏడాది సంక్రాంతి ఈ బరిలో దిగుతూ ఉండడంతో.. చిరంజీవి కూడా సంక్రాంతి సీజన్ ను రామ్ చరణ్ కే వదిలేసారు.
ఇక సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమ్మర్ లో ఆల్రెడీ ప్రభాస్ రాజా సాబ్ సినిమా రెడీ అవుతోంది. కానీ షూటింగ్ ఇంకా పూర్తకపోవడంతో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ సమ్మర్ నుంచి తప్పుకుంటే చిరంజీవి తన విశ్వంభర సినిమాని ఆ సమయానికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభాస్ సినిమా అనుకున్నట్లుగానే సమ్మర్లో విడుదల అవుతుంటే.. చిరంజీవి ప్రభాస్ కోసం కూడా తన సినిమాని వాయిదా వేస్తారేమోనని ఫాన్స్ ఇప్పటినుండే కంగారు పడుతున్నారు. సినిమాకి విడుదల గురించి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.