HomeTelugu Trendingజగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

జగన్‌కి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

4 23
ఏపీ సీఎం జగన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని సీఎం జగన్ చెప్పారని, అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని ట్విటర్‌ వేదికగా చిరంజీవి ప్రకటించారు.

కాగా సినీ పరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ భేటీ అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్‌ను కొనసాగించే విధంగా అనుమతులు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu