HomeTelugu Trendingఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయానున్న చిరంజీవి

ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయానున్న చిరంజీవి

Chiranjeevi starting

కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌ హీరో మెగాస్టార్‌ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో చిరు ఆక్సిజన్‌ బ్యాంకును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. సమయానికి ఆక్సిజన్‌ అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో చిరు ఆక్సిజన్‌ బ్యాంకు ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లో ప్రజలకి ఆక్సిజన్‌ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్ల చేస్తున్నారు’’ అని చిరంజీవి ఆఫీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆక్సిజ‌న్ ట్యాంకుల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను అభిమాన సంఘాల జిల్లా అధ్య‌క్షుల‌కు అప్ప‌గించ‌నున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu