గోవాలో 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 గా ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలో అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. నేను సినిమాలను ఎప్పటికీ వదలనని నా ప్రియమైన స్నేహితులకు వాగ్దానం చేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ప్రేమకు నేను ఎంతో రుణపడి ఉంటాను. నా జీవితాంతం వారి పట్ల కృతజ్ఞతతో ఉంటానన్నాడు చిరంజీవి.
“I am promising my dear Friends i will never leave Films. Iam greatly indebted to the love showered by Telugu audiences across the world. Heartfelt gratitude to them for my entire Life” : @KChiruTweets at #IFFI2022 closing ceremony.#Chiranjeevi #Megastar pic.twitter.com/FQXxCuafHm
— All India Radio News (@airnewsalerts) November 28, 2022