ఈ రోజు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేడు 45వ వసంతంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువ మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కేటీఆర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ.. డియర్ తారక్.. నువ్వు ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటావు. ఆ విషయం నాకు ఆనందం కలిగించేది. ప్రజల ప్రతి అవసరాన్ని తన అవసరంగా భావించి వాళ్ల కోరికలు తీర్చడంలో ముందుంటావు.
భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరారు. అంతేకాదు నీవు ఎల్లకాలం ఆనందంతో ఉండాలని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు కేటీఆర్‌కు సినీ పరిశ్రమ నుంచి కోన వెంకట్‌తో పాటు బండ్ల గణేష్ సహా పలువురు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Dear Tarak @KTRTRS
🌷𝓗𝓪𝓹𝓹𝔂 𝓑𝓲𝓻𝓽𝓱 𝓓𝓪𝔂 💐
I have always been delighted & thankful for the way you are ALWAYS accessible to needy citizens & provide reassurance by personally reaching out, helping.More power to you to serve people more & more & for many many years! pic.twitter.com/V11Sw4W1lA— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2020