టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకరి జీవితాన్ని కాపాడడానికి మించిన సంతృప్తి మరొకటి లేదని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మొదటి నుంచి ఇప్పటివరకూ తాను రక్తదానం చేసిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. రక్తదానం చేసిన సందర్భాలన్నీ తనకి ఎంతో సంతోషాన్ని, జీవితంలో ఒక సంతృప్తిని ఇచ్చాయని ఆయన తెలిపారు. ‘రక్తదానం చేసి వేరొకరి జీవితాన్ని కాపాడడానికి మించిన ఆనందం జీవితంలో ఏముంటుంది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, చాలామంది తమ రక్తాన్ని దానం చేస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవుతోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు రక్తాన్ని దానం చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇటీవల లాక్డౌన్ సమయంలో సైతం చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు రక్తదానం చేసిన విషయం తెలిసిందే.
What else can be more satisfying than saving someone’s life..Everytime I hear that a blood donation camp is organized and people are donating blood, I thank almighty for the super power he gave us mankind.
రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!#worldblooddonorday2020 pic.twitter.com/PjvB7wyp43
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2020