HomeTelugu Trendingపవన్‌ అడిగితే ఇచ్చేస్తా: చిరంజీవి

పవన్‌ అడిగితే ఇచ్చేస్తా: చిరంజీవి

1 6
టాలీవుడ్‌.. స్టార్‌ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమా తరువాత మెగాస్టార్ కొరటాల డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే, కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్‌ తగిన తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారు.

అయితే, ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మలయాళం సినిమా లూసిఫర్ సినిమా చేస్తారని అంటున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా రైట్స్‌ని రామ్ చరణ్ కొనుగోలు చేశారు. మోహన్ లాల్- పృథ్విరాజ్ నటించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో మెగాస్టార్.. రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా చేస్తారని వినికిడి. అయితే, మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకవేళ తమ్ముడు పవన్ ఈ సినిమా చేస్తాను అంటే దీనిని పవన్ కు ఇచ్చేస్తానని అన్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే ఇప్పటికే పవన్ కల్యాణ్‌ మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. వకీల్ సాబ్, క్రిష్ సినిమా, హరీష్ శంకర్ సినిమాలు లైన్లో ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu