కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులు రాగా వారిలో దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగాస్పందించారు. తన ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఆ అవార్డుకు ఆయన అర్హుడని అన్నారు. బ్రాకెట్స్లో మరణానంతరం వచ్చిన పద్మవిభూషణ్ అనే పదం ఉండడం మాత్రం తనను చాలా బాధిస్తోందని తెలిపారు. ఆయన పద్మవిభూషణ్ అవార్డును వ్యక్తిగతంగా స్వీకరించి ఉంటారనే భావిస్తున్నానని అన్నారు.