మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరంజీవి ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరంజీవి వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి కోసం సోషల్ మీడియాలో రాసింది మాత్రం మనసు గెలుచుకుంది.
ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు’ క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో . శంకర బాబు’ అని ట్వీట్ చేశాడు. ఈ మనోహరమైన శుభాకాంక్షలతో పాటు చిరు, అంజనా దేవి, భార్య సురేఖతో ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్, ఇంకా పేరు పెట్టని కెఎస్ రవీంద్ర చిత్రంలో కనిపించనున్నారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022