మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవన్ కల్యాణ్ నిర్మాణంలో సినిమా ఉండనుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవలే పవన్ కల్యాణ్ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పేరిట ఓ బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు.
ఇందులో భాగంగా నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అలానే తన అన్నయ్య చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. రీసెంట్ గా త్రివిక్రమ్.. ప్రత్యేకంగా చిరంజీవిని కలిసి మాట్లాడారు. అది కూడా ఈ సినిమా గురించే అని తెలుస్తుంది.
వారిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్, పవన్ కల్యాణ్ ప్రొడక్షన్ కావడంతో చిరు కూడా ఈ ప్రాజెక్ట్ పై మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాను. ఈ విషయం మెగాభిమానులకు శుభవార్తనే చెప్పాలి!