మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన తదుపరి సినిమాలను శ్రీవశిష్ఠ డైరెక్షన్లోను .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోను చేయనున్నారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి ఒక కథను వినిపించడం .. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని టాక్.
ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవితోనే అనిల్ రావిపూడి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి అంచలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి వరకూ వచ్చేశాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉన్నాయి.