HomeTelugu Trendingదగ్గుపాటి పెళ్లి సందడిలో చిరంజీవి- మహేష్‌

దగ్గుపాటి పెళ్లి సందడిలో చిరంజీవి- మహేష్‌

Chiranjeevi Mahesh in venk 1
దగ్గుపాటి వారి ఇంట్లో మరోసారి పెళ్లి సందడి మొదలైపోయింది. వెంకటేష్ చిన్న కూతురు హవ్య వాహిని పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విజయవాడకు చెందిన ఒక డాక్టర్ కుటుంబంలో ఆమె కోడలుగా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వారి ఎంగేజ్మెంట్ వేడుకను కూడా తాజాగా నిర్వహించారు.

ఈ వేడుకకు అతి కొద్దిమంది ప్రముఖులను మాత్రమే పిలవడం జరిగింది. హీరో వెంకటేష్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ హీరోలతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన సోదరుడు సురేష్ బాబు ఇండస్ట్రీలోని బడా నిర్మాతల్లో ఒకరు. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకను విజయవాడలో నిర్వహించగా వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకల్లో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ ఇంట్లో జరిగే అతి ముఖ్యమైన వేడుకలకు మహేష్ బాబు ప్రతిసారి అటెండ్ అవుతూ ఉంటారు. ఇక ఈసారి వెంకటేష్ చిన్న కూతురుని ఆశీర్వదించేందుకు ఆయన రావడం జరిగింది.

Chiranjeevi Mahesh1 1

ప్రస్తుతం మహేష్‌ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ.. ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు అంటే వారి మధ్యలో ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే వెంకటేష్ తో మహేష్ బాబు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిన్నోడు పెద్దోడు పాత్రలతో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యారు ఆ ఇద్దరు.

ఇక దగ్గుబాటి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు కూడా ఈ నిశ్చితార్థం వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక హీరో నాగచైతన్య, రానా దగ్గుపాటి అతిధులందరిని కూడా రిసీవ్ చేసుకుంటూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu