మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లోనే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఈ చిత్ర దర్శకుడు మోహన్ రాజా ఓ ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల దీవెనతో సినిమా స్టార్ట్ అయ్యిందని తెలిపారు. భారీ అంచనాలు నడుమ వస్తోన్న ఈ సినిమా అదిరే యాక్షన్ సీక్వెన్స్‌తో షురూ చేసినట్టుగా తెలుస్తుంది.
చిరంజీవి 153వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
With the blessings of parents and well wishers starting next journey, this time a Mega one 😇
Getting set with an amazing team
Dop #Niravshah
Art dir @sureshsrajan
Stunt @silvastunt #Chiru153 #megastar153#shootstarts pic.twitter.com/puSMuJP4Ju— Mohan Raja (@jayam_mohanraja) August 13, 2021