HomeTelugu Big Storiesమీసం మెలేయడం కాదు.. మాస్క్‌ ధరించడం వీరత్వం..

మీసం మెలేయడం కాదు.. మాస్క్‌ ధరించడం వీరత్వం..

1 11కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే చాలాసార్లు మెగాస్టార్‌ చిరంజీవి వీడియోల రూపంలో సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు చిరు. ఇందులో మాస్కుల ప్రాధాన్యత గురించి ఆయన తనదైన శైలిలో వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని ఆయన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులు మరింత పెరిగిపోతాయని చెప్పారని గుర్తు చేశారు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపారు.అందుకే, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి.. ప్లీజ్’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం’ అని పేర్కొంటూ, ఆయన మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వీడియో రూపంలో సందేశం ఇచ్చారు. హీరోయిన్ ఈషా రెబ్బా.. యంగ్‌ హీరో కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu