యూత్ కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హలో’. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చితం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 20న హీరో అఖిల్ సహా యూనిట్ సభ్యులందరూ డిసెంబర్ 20న స్పెషల్ ప్రమోషనల్ షోను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
‘హలో’ ప్రమోషన్స్‌లో భాగంగా యు.ఎస్ టూర్‌లో న్యూజెర్సీ, సాన్‌జోస్, డల్లాస్‌లలో యూత్ కింగ్ అఖిల్, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌తోపాటు మరో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పాల్గొని ప్రేక్షకులను థ్రిల్ చేశారు. ఆడియెన్స్‌ను పలకరిస్తూ వారితో ఆడి పాడారు. ముఖ్యంగా హీరో అఖిల్ యూనిట్‌తో కలిసి… హలో సినిమాలోని పాటలు పాడుతూ, లైవ్‌లో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్‌ఫార్మన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. హీరో రానా దగ్గుబాటి.. వ్యాఖ్యాతగా వ్యవహరించి యూనిట్ సభ్యులకు ఎనర్జీని అందించారు. షో సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావడంలో తన వంతు పాత్రను పోషించారు. యు.ఎస్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించిన ఈ ప్రమోషనల్ షోకు ఆడియెన్స్ నుండి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.