చరణ్ – ఉపాసనలకు చిరంజీవి గ్రీటింగ్స్‌


టాలీవుడ్ జంట మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్- ఉపాసనల పెళ్లిరోజు నేడు. 2012 జూన్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అంటే ఇది వీరి 11వ పెళ్లి రోజు. అంతేకాదు.. ఈ దంపతులకు మరికొన్ని రోజుల్లో బిడ్డ జన్మించబోతున్న నేపథ్యంలో ఈ వెడ్డింగ్ యానివర్సరీ వీరికి మరెంతో ప్రత్యేకంగా మారింది. మరోవైపు వివాహ వార్షికోత్సవం సందర్భంగా చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడు చరణ్, కోడలు ఉపాసనలకు గ్రీటింగ్స్ తెలియజేశారు.

“హాయ్ చరణ్ అండ్ ఉప్సీ… ప్రత్యేకమైన ఈరోజున మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ మేము ఎంతో గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేశారు. మీరిద్దరూ తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్. మీ బిడ్డపై మీకుండే ప్రేమ ఇతరులు కూడా చెప్పుకునే విధంగా ఉండాలి. లవ్ అండ్ బ్లెస్సింగ్స్… అమ్మ, నాన్న” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu